జమ్ముకశ్మీర్ లో భారీ వరదలు, ఏడుగురు మృతి
- July 28, 2021
జమ్ముకశ్మీర్ లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు పోటెత్తాయి. హంజార్ లో ఒక్కసారిగా పోటెత్తిన వరదలతో ఇళ్లు కొట్టుకపోయాయి. నలుగురు మృతి చెందారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. 9 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారత వాయుసేన సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు వరదల పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలకు కేంద్రం అండగా ఉంటుందని, ప్రతొక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కిష్ట్వార్ జిల్లాలో వరద పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. అక్కడి అధికారులతో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారు. ప్రజలను రక్షించడానికి, గల్లంతైన వ్యక్తులను గుర్తించడానికి ఆర్మీ, NDRF బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని, వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. కిష్ట్వార్ జిల్లాలో వరదలకి సంబంధించి జమ్ముకశ్మీర్ కు చెందిన ఎల్జీ, డీజీపీలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటమే తమ ప్రాధాన్యత అన్నారు.
తాజా వార్తలు
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు









