'మారన్' ఫస్టులుక్ విడుదల..!
- July 28, 2021తమిళంలో విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే హీరోగా ధనుశ్ కనిపిస్తాడు. ఒక వైపున తనకి గల మాస్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఆయన కొత్త కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'అసురన్' .. 'కర్ణన్' చిత్రాలు అక్కడ మంచి ఫలితాలను దక్కించుకున్నాయి. ధనుశ్ చేసిన మరో సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున ధనుశ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాకి ఃమారన్ః అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుశ్ యాక్షన్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 'అతని ధైర్యమే అతని ఆయుధం' అంటూ ధనుశ్ పాత్రను గురించి కార్తీక్ నరేన్ హింట్ ఇచ్చాడు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 43వ సినిమా. అర్జున్ - త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!