మోదీతో బ్లింకన్ భేటీ
- July 28, 2021
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్‌కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతుగా అదనంగా 25 మిలియన్ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత్ వ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా గొలుసును బలోపేతం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అమెరికా సాయం ఉపకరిస్తుందని బ్లింకన్ తెలిపారు. కాగా,కరోనాను ఎదుర్కొనేందుకు గతేడాది జూన్‌లో 41 మిలియన్ డాలర్లను అమెరికా భారత్ కు సాయంగా అందించిన విషయం తెలిసిందే. తాము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు అండగా నిలుస్తామని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ తెలిపింది.
ఇక,రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్లింకెన్..కోవిడ్ తొలినాళ్లలో భారత్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భారత్‌కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.
ఇక, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతాధికారులతో బ్లింకన్ సమావేశమయ్యారు. బ్లింకన్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..ఈ రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ను కలవడం చాలా బాగుంది. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ యొక్క బలమైన నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









