దుబాయ్ గ్లోబల్ విలేజ్..కొత్త అనుభూతి కలిగించేలా విఐపి ఎంట్రెన్స్
- July 29, 2021
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్ అంటేనే అదో వింత అనుభూతి. అందులోనూ విఐపి హోదాలో ఎంట్రీ ఇవ్వటం అంటే ఎలా ఉంటుంది.ఆ థ్రిల్లింగ్ అదిరిపోవాలి కదా! అదే రేంజ్ లో గ్లోబల్ విలేజ్ ఎంట్రెన్స్ ను తీర్చిదిద్దుతున్నారు నిర్వాహకులు.అక్టోబర్ 26 నుంచి ప్రారంభం కాబోతున్న 26వ సీజన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.పలు వర్గాల నుంచి సమీకరించిన అభిప్రాయాలు, సూచనలతో విఐపి ఎంట్రెన్స్ ను అదరహో అనేలా తీర్చిదిద్దుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.విఐపి ఎంట్రెన్స్ ద్వారా గ్లోబల్ విలేజ్ ను సందర్శించే వారికి మరిచిపోలేని అనుభూతిని కలిగించటమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.విఐపి ప్యాక్ తీసుకున్నవారికి విఐపి ఎంట్రీతో పాటు ప్రత్యేక పార్కింగ్, వండర్ పాస్ కార్డ్, ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని వెల్లడించారు.ఇదిలాఉంటే దుబాయ్ గ్లోబల్ విలేజ్ ఆక్టోబర్ 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









