జీవనోపాధి కొరకు కువైట్ వెళ్లిన మహిళ దీనగాథ
- July 29, 2021
కువైట్: కువైట్ లో APNRTS రీజినల్ కో-ఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా, వీరాశ్రం మండలం కాసాని దుర్గా భవాని అనే మహిళ తమ కుటుంబ సభ్యుల ఉజ్వల భవిష్యత్తు కొరకు సంవత్సరం క్రితం కువైట్ సబా అల్ అహమ్మద్ ప్రాంతములో కువైటీ ఇంటిలో హౌస్ మెయిడ్ గా వెళ్ళింది.అయితే వెళ్లినప్పటి నుండి కువైటి (స్పాన్సర్)చిత్రహింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.విధిలేని పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యుల ఆశలు తనపైనే ఉన్నాయని బాధలు భరిస్తూ పని చేసుకుంటూ ఉండేది.స్పాన్సర్ అరాచకాలు ఎక్కువై భరించలేక, ఎదిరించి బయటికి పోలేక కువైట్ ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి వెళ్లాలని మూడో అంతస్థు నుండి చీర కట్టి బయటపడాలనుకుంది.ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు క్రింద పడటం వలన రెండు కాళ్లు విరిగాయి.ఈ విషయం స్పాన్సర్ కు తెలిసినా కనికరం లేకుండా, కనీసం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తన ఇంట్లోనే ఒక రూములో పెట్టడం జరిగింది.
రోజు రోజుకు కాళ్ళ నొప్పులు ఎక్కువ కావడంతో బాధ భరించలేని దుర్గా భవాని ఇంట్లో ఎవ్వరూ లేని సమయములో అవస్థలు పడుతూ పాకుకుంటూ బయటపడింది.ఆ దారిన వెళ్లే మరో కువైటి ఆమెను చూసి మానవత్వంతో పోలీస్ లను పిలిపించి అధన్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా ఎంబసీ అధికారులు కువైట్ APNRTS కో-ఆర్దినేటర్స్ కు తెలిపారు. వెంటనే కువైట్ APNRTS సభ్యులు ఆసుపత్రికి వెళ్ళి దుర్గా భవానిని పరామర్శించి, ధైర్యం చెప్పి భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులతో టెలిఫోన్ లో మాట్లాడించడం జరిగింది.
ఎంబసీ అధికారులు స్పాన్సర్ పై కేసు పెట్టి దుర్గా భవానికి న్యాయం చేసి సురక్షితముగా భారతదేశం పంపే ఏర్పాట్లు చేస్తామన్నారని నాయని మహేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భముగా APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి, డైరెక్టర్ బి.హెచ్. ఇలియాస్ మాట్లాడుతూ కువైట్ అంబాసిడర్ సి.బి. జార్జ్ ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించే తీరును ప్రశంసించారు.కువైట్ APNRTS కో-ఆర్డినేటర్స్ సేవలు అభినందనీయమని, ఎంబసీ అధికారులకు, కువైట్ APNRTS సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఆసుపత్రిలో దుర్గా భవానిని APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కో- ఆర్డినేటర్ పిట్టా సురేష్, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కో- కన్వీనర్ గోవిందు నాగరాజు మరియు వైకాపా మైనారిటీ నాయకుడు షేక్ రహమతుల్లా పరామర్శించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









