వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..
- July 29, 2021
న్యూ ఢిల్లీ: వాట్సాప్ లో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి మరో కొత్త యాప్ ను తీసుకువచ్చింది.సందేశ్ గా ఆ యాప్ కు పేరు పెట్టారు.
ఈ యాప్ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు వివరించారు.ఈ యప్ చాలా సురక్షితమైనదని తెలిపారు.ఈ యాప్ కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు.
వాట్సాప్ లో మాదిరిగా నే వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్ లో ఉండనున్నాయి. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్ వివరించారు.
ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసింది. NIC తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్ ను లాంచ్ చేశాయి.
కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.
ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్ నంబర్ ను నమోదు చేసి, ఓటీపీని వెరిఫికేషన్ చేస్తే ఈ యాప్ ను వాడుకోవచ్చు.
ఈ యాప్ కు సంబంధించిన కొన్ని వివరాలు..
- ఈ యాప్ కు వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు.అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది.అనంతరం ఓటీపీ వస్తుంది.ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది.
- ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







