వ్యాక్సిన్ పొందిన వారు కువైట్ రావొచ్చు..డీజీసీఏ క్లారిటీ
- July 30, 2021
కువైట్: భారత్ నుంచి కువైట్ వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రవాయులకు తీపి కబురు అందించింది ఆ దేశ డీజీసీఏ. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు ఇంకా అనుమతి లేదు కనుక నేరుగా కువైట్ చేరుకునే అవకాశం మాత్రం ఉండదు. భారత్ నుంచి ఇతర దేశాల మీదుగా కువైట్ వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు..గతంలో తరహాలో ఇతర దేశాల్లో క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేకుండానే ఆగస్ట్ 1 నుంచి లింక్డ్ ఫ్లైట్స్ ద్వారా కువైట్ చేరుకోవచ్చని కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ యూసఫ్ సులైమాన్ అల్ ఫౌజాన్ స్పష్టం చేశారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హజరైన ఆయన..పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి భారత్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునరుద్ధరించలేదని వెల్లడించారు. అయితే..ఇండియా నుంచి ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణపై ఆలోచిస్తున్నామని..త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందని సూచనప్రాయంగా చెప్పారు. ఆలోపు భారత్ నుంచి కువైట్ రావాలనుకునే ప్రవాసీయులు క్వారంటైన్ అవసరం లేకుండా ఇతర దేశాల నుంచి కువైట్ చేరుకోవచ్చన్నారు. అలాగే కువైట్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించొచ్చు. ప్రయాణికులు తప్పకుండా కువైట్ అనుమతి పొందిన వ్యాక్సిన్లలో రెండు డోసులు తీసుకొని ఉండాలి. ఇమ్యూన్ యాప్ లో గ్రీన్ సిగ్నల్ ఉండాలి. అలాగే ప్రయాణానికి 72 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









