సెమీస్‌ పోరులో పివి సింధు ఓటమి..

- July 31, 2021 , by Maagulf
సెమీస్‌ పోరులో  పివి సింధు ఓటమి..

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పివి సింధు సెమీస్ పోరాటం ముగిసింది.వరల్డ్ నెం.1, చైనా ప్లేయర్ జు యింగ్లో జరిగిన సెమీస్ పోరులో సింధు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.దీంతో 21-18, 21-12 తేడాతో ఓటమిపాలైంది.ఫలితంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతక ఆశలు గల్లంతయ్యాయి.ఇక కాంస్య పతకం కోసం మాత్రమే సింధుకు అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com