ఏపీ కరోనా అప్డేట్
- July 31, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,992 శాంపిల్స్ పరీక్షించగా… 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,053 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్‌లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతిచెందారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175కు.. రికవరీ కేసులు 19,31,618కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 13,377గా ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,180 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల సంఖ్య 2,45,63,043కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







