తీవ్రమైన నష్టాల్లో హుక్కా కేఫ్ యజమానులు

- July 31, 2021 , by Maagulf
తీవ్రమైన నష్టాల్లో హుక్కా కేఫ్ యజమానులు

కువైట్: కువైటీ ఫెడరేషన్ ఆఫ్ హుక్కా కేఫ్స్, హుక్కా సేవల్ని రెస్టారెంట్లలోనూ కేఫ్‌లలోనూ తిరిగి ప్రారంభించేందుకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా సంబంధిత కమిటీ కోరింది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి హుక్కా సెంటర్ల మూసివేతతో తీవ్రమైన నష్టాల్ని హుక్కా యజమానులు చవిచూసినట్లు ఫెడరేషన్ వెల్లడించింది. కొంత కాలం తర్వాత రెస్టారెంట్లు, కేఫ్‌లు తెరచుకున్నా హుక్కాకి అనుమతులు ఇవ్వలేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని వెల్లడించింది. ఆ కారణంగా వర్కర్లకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు, దాంతో ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com