మైనర్ యాక్సిడెంట్లపై ఆన్ లైన్ రిపోర్టింగ్ సిస్టం

- August 01, 2021 , by Maagulf
మైనర్ యాక్సిడెంట్లపై ఆన్ లైన్ రిపోర్టింగ్ సిస్టం

బహ్రెయిన్: చిన్న ట్రాఫిక్ ప్రమాదాల రిపోర్టింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం ఈ-ట్రాఫిక్ యాప్ ద్వారా కొత్త సేవలు ప్రారంభించింది. ఈ విధానంతో రోడ్లపై జరిగే మైనర్ యాక్సిడెంట్ల వివరాలు నేరుగా రిపోర్ట్ అవుతాయి.అలాగే ఆ సమాచారం బీమా కంపెనీలకు చేరుతుందని ఇన్ఫర్మేషన్ & ఈ -గవర్నమెంట్ అథారిటీ(iGA) వెల్లడించింది. ఈ-ట్రాఫిక్ విధానంలో నాలుగు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రిపోర్ట్ ట్రాపిక్ యాక్సిడెంట్స్-  రిపోర్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా దేశ పౌరులు, ప్రవాసీయులు, జీసీసీ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు మైనర్ రోడ్డు ప్రమాదాల పట్ల బీమా కంపెనీలను అప్రమత్తం చేయవచ్చు.
వ్యూ రిపోర్టెడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్- వ్యూ రిపోర్టెడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తో రిపోర్ట్ అయిన ప్రమాదాల వివరాలను తెలుసుకోవచ్చు.
ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్నాలెడ్జ్ మెంట్ - ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్నాలెడ్జ్ మెంట్ తో ప్రమాదానికి బాధ్యుడైన డ్రైవర్ ఎవరు తెలుసుకునేందుకు వీలుంటుంది.
ఇన్సూరెన్స్ కంపెనీస్ లోకేటర్ - ఇన్సూరెన్స్ కంపెనీస్ లోకేటర్ ద్వారా బీమా కంపెనీలు, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాటి కాంటెక్ట్ నెంబర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com