319 మంది ఆస్టర్ డాక్టర్లకు గోల్డెన్ వీసా
- August 01, 2021
యూఏఈ: ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ నెట్వర్క్ కు చెందిన 319 మంది డాక్టర్లకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది యూఏఈ. వైద్యరంగంలో ఆస్టర్ వైద్యులు, సిబ్బంది చేస్తున్న నిరంతర సేవలకు గుర్తింపుగా వారికి దీర్ఘకాలిక వీసాలను ప్రదానం చేసింది. తమ హెల్త్ కేర్ వైద్యుల సేవలను గుర్తించి..వారికి గోల్డెన్ వీసాలను మంజూరు చేయటం పట్ల ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ హర్షం వ్యక్తం చేసింది. యూఏఈ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తమ నిబద్ధతను చాటుకునేలా మరింత ప్రోత్సహాం అందించినట్లైందని ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ అన్నారు. డాక్టర్ ఆజాద్ మూపెన్ కు 2019లోనే గోల్డెన్ వీసా మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమ సిబ్బందికి కూడా గోల్డెన్ వీసాలు మంజూరు కావటం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారాయన. గోల్డెన్ వీసా పొందిన డాక్టర్లకు అభినందనలు తెలిపారు. అలాగే వైద్యరంగంలో దూరదృష్టి గల పాలకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.గోల్డెన్ వీసా అందుకున్నవారిలో అస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అలీషా మూపెన్ కూడా ఉన్నారు.యూఏఈ ప్రజలకు వైద్య సేవలు అందించటంలో ఆమె నిరంతర కృషికి గోల్డెన్ వీసాతో సత్కరించారు.ఇదిలాఉంటే..ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ తొలుత ఒకే ఒక క్లినిక్ తో వైద్య సేవలను ప్రారంభించింది. 1987 లో దుబాయ్‌లో తొలి క్లీనిక్ ప్రారంభించింది. ఆ తర్వాత 7 దేశాలలో విస్తరించి ప్రపంచవ్యాప్తంగా 27 ఆస్పత్రులు, 115 క్లినిక్‌లు, 223 ఫార్మసీలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









