పాకిస్థాన్ లో కరోనా ఫోర్త్ వేవ్..
- August 03, 2021
పాకిస్తాన్: మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మన దాయాది దేశం పాకిస్థాన్లో అప్పుడే ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందట. ఈ నేపథ్యంలో పాక్ లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ సందర్భంగా పాక్ ప్రణాళికాశాఖ మంత్రి అసద్ ఉమర్ మాట్లాడుతూ, డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కొత్త కేసులతో పాటు, పాజిటివిటీ శాతం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే సిటీల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ముల్తాన్, అబోట్టాబాద్, ఫైసలాబాద్, మీర్పూర్, హైదరాబాద్, గిల్గిత్, స్కర్దు తదితర నగరాల్లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో 8 గంటల లోపే వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 50 శాతం ఉద్యోగులతో విధులను నిర్వహించాలని చెప్పారు. ప్రజా రవాణా వాహనాల్లో 50 శాతం మందికే అనుమతి ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







