బెన్ఫిషియల్ ఓనర్ వివరాలు ఇవ్వని 148 కంపెనీలకు ఫైన్
- August 04, 2021
దుబాయ్: దుబాయ్ ఆర్ధికశాఖలోని వాణిజ్య సమ్మతి, వినియోగదారుల రక్షణ-CCCP 148 కంపెనీలకు జరిమానా విధించింది. వాణిజ్య, పారిశ్రమల చట్టాలను అనుసరించి కంపెనీలు తమ బెన్ఫిషియరీ ఓనర్ వివరాలను నిర్ణీత కాల వ్యవధిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ పాలనా యంత్రాంగం గత జూన్ 30 నాటికి కంపెనీలను వివరాలను పొందుపర్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే..అధికారులు సూచించిన గడువులోగా బెన్ఫిషియర్ ఓనర్స్ వివరాలను కమర్షియల్ రిజిస్ట్రి వద్ద నమోదు చేసుకోని కంపెనీలకు CCCP ఫైన్ విధించింది. నిబంధన ఉల్లంఘించిన ఒక్కో కంపెనీకి AED 15,000 చొప్పున జరిమాన విధించారు. ఇకనైనా కంపెనీలు తమ బెన్ఫిషియల్ ఓనర్స్ వివరాలను దుబాయ్ ఎకానమీ ఇ -సర్వీసెస్ పేజీలో లేదా కాల్ సెంటర్ నెంబర్ +97144455555 ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







