భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- August 04, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.నిన్నటి రోజున 30 వేలకు పడిపోయిన కేసులు ఈరోజు తిరిగి 40 వేలకు పైగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.గడిచిన 24 గంటల్లో భారత్‌లో 42,625 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 3,09,33,022 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక, 4,10,353 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో 36,668 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.ఇక, 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 562 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,25,757కి చేరింది.24 గంటల్లో భారత్‌లో 62,53,741 మందికి వ్యాక్సిన్ అందించారు.దీంతో ఇప్పటి వరకు మొత్తం 48,52,86,570 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







