బెన్ఫిషియల్ ఓనర్ వివరాలు ఇవ్వని 148 కంపెనీలకు ఫైన్

- August 04, 2021 , by Maagulf
బెన్ఫిషియల్ ఓనర్ వివరాలు ఇవ్వని 148 కంపెనీలకు ఫైన్

దుబాయ్: దుబాయ్ ఆర్ధికశాఖలోని వాణిజ్య సమ్మతి, వినియోగదారుల రక్షణ-CCCP 148 కంపెనీలకు జరిమానా విధించింది. వాణిజ్య, పారిశ్రమల చట్టాలను అనుసరించి కంపెనీలు తమ బెన్ఫిషియరీ ఓనర్ వివరాలను నిర్ణీత కాల వ్యవధిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ పాలనా యంత్రాంగం గత జూన్ 30 నాటికి కంపెనీలను వివరాలను పొందుపర్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే..అధికారులు సూచించిన గడువులోగా బెన్ఫిషియర్ ఓనర్స్ వివరాలను కమర్షియల్ రిజిస్ట్రి వద్ద నమోదు చేసుకోని కంపెనీలకు CCCP ఫైన్ విధించింది. నిబంధన ఉల్లంఘించిన ఒక్కో కంపెనీకి AED 15,000 చొప్పున జరిమాన విధించారు. ఇకనైనా కంపెనీలు తమ బెన్ఫిషియల్ ఓనర్స్ వివరాలను దుబాయ్ ఎకానమీ ఇ -సర్వీసెస్ పేజీలో లేదా కాల్ సెంటర్ నెంబర్ +97144455555 ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com