వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్
- August 04, 2021
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ రోజు పర్యటించారు. గ్రామమంతా తిరిగి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలోని దళితవాడల్లో పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికీ తిరిగి దళితబంధు పథకం గురించి చర్చించారు. పథకం గురించి ఏమేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను ప్రశ్నించారు సీఎం. పెద్దమొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని, స్పష్టమైన అవగాహనతో పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంటికి వెళ్లారు.. అక్కడే భోజనం చేశారు.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అందరికీ ఒకే విడతలో దళితబంధు నిధులు పంపిణీ చేస్తామని, అయితే ప్రతి లబ్ధిదారుని వద్ద రూ.10వేలు చొప్పున ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ డబ్బులతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దీనివలన ఎస్సీలలో ఎవరికి ఆపద వచ్చినా.. దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇక గ్రామంలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందని, ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







