కాంస్యాన్ని కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు
- August 05, 2021
టోక్యో: ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే.కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది.నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది.రెండు క్వార్టర్లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.కీలకమైన నాలుగో క్వార్టర్ ప్రారంభంలోనే జర్మనీ జట్టు గోల్ చేసి లీడ్‌ను 5-4కి తగ్గించింది.అయితే, భారత ఆటగాళ్లు ఆటపైన, బంతిపైన నియంత్రణ సాధించి జర్మనీ మరో గోల్ చేయకుండా అడ్డుకున్నారు.దీంతో ఇండియా జట్టు 5-4 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్యపతకాన్ని గెలుచుకుంది.41 ఏళ్ల తరువాత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఒలింపిక్స్‌తో పతకం సాధించిన ఇండియా జట్టుకు భారత ప్రధాని మోడీ అభినందలను తెలియజేశారు.
తాజా వార్తలు
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..







