కోవిడ్ తీవ్రత ఎక్కువ దేశాల ప్రవాసీయులకు నో ఎంట్రీ
- August 05, 2021
కువైట్: విదేశాల నుంచి వచ్చే ప్రవాసీయుల ప్రవేశ అనుమతికి సంబంధించి మరోసారి కువైట్ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే..డాక్టర్లు, దౌత్యవేతలు, కోవిడ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి పొందిన వారికి మాత్రం అనుమతి ఉంటుంది. ప్రస్తుతం కువైట్ కోవిడ్ హై రిస్క్ దేశాల జాబితాలో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా దేశాల నుంచి ప్రవాసీయులకు డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలా..వద్దా అనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ భవిష్యత్తులో ప్రకటించనుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో రోజుకు గరిష్టంగా 5000 వరకు పెంచినా..గత కొద్ది రోజులుగా దేశంలోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరలేకపోతోంది. కొద్ది రోజులుగా రోజుకి 3000 మంది వరకు మాత్రమే కువైట్ వస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









