వీసా గడువు చెక్ చేసుకోండి..ప్రవాసీయులకు యూఏఈ సూచనలు
- August 05, 2021
యూఏఈ రెసిడెన్సీ వీసా ఉండి..వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇవాళ్టి నుంచి యూఏఈ ప్రయాణించొచ్చు.కోవిడ్ నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలతో ఇన్నాళ్లు సొంత దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయులు ఆగస్ట్ 5 తిరిగి ఉద్యోగాల్లో చేరొచ్చు.అలాగే ఎమిరేట్స్ లోని వారికి ఇంటికి చేరొచ్చు. ఇండియా,శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, నైజీరియా, ఉగాండ దేశాల వైద్య సిబ్బంది, టీచర్లు, ఫెడరల్, స్థానిక ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నేరుగా యూఏఈ ప్రయాణించొచ్చు. అయితే..పౌర గుర్తింపు అధికార విభాగం-ICA, నివాస, విదేశీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్-GDRFA నుంచి అనుమతి ఉండాలి. అలాగే మానవత్వ కోణాల్లో అనుమతి పొందిన వారు కూడా నేరుగా ప్రయాణించొచ్చు.
కానీ, కోవిడ్ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో ఉంటున్న ప్రవాసీయుల్లో కొందరి వీసా గడువు ఇప్పటికే ముగిసింది.మరికొందరు 6 నెలల కంటే ఎక్కువ రోజుల యూఏఈ వెలుపల ఉండాల్సి వచ్చింది.ఈ కేటగిరిలో ఉన్న ప్రవాసీయులు యూఏఈలో రీఎంట్రీకి చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.అందుకే ప్రయాణానికి ముందే వారి అర్హత, వీసా గడువును ఓ సారి చెక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
వీసా అర్హత చెక్ చేసుకోవటం ఎలా?
ప్రయాణికులు ఒక వేళ దుబాయ్ రెసిడెన్సీ రెసిడెంట్స్ అయితే..
https://smartservices.ica.gov.
దుబాయ్ కాకుండా ఇతర ఎమిరేట్స్ లో రెసిడెంట్ వీసా ఉన్న వారు..
https://smartservices.ica.gov.
6 నెలలుగా యూఏఈ వెలుపల ఉంటే?
యూఏఈ రెసిడెన్సీ వీసా ఉండి వరుసగా 6 నెలలుగా యూఏఈలో లేకుంటే వారి వీసా ఆటోమెటిగ్గా రద్దవుతుంది. అంటే వారు మళ్లీ కొత్త వీసా కోసం అప్లే చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ లో రెసిడెన్సీ వీసా కలిగిన వారైతే..
https://smart.gdrfad.gov.ae/
ఒక వేళ దుబాయ్ కాకుండా యూఏఈలోని ఇతర ఎమిరేట్స్ నుంచి రెసీడెన్సీ వీసా తీసుకుంటే..
https://smartservices.ica.gov.
దరఖాస్తుదారులు ఎంప్లాయిమెంట్, ఫ్యామిలీ విసిట్, టూరిస్ట్, ట్రీట్మెంట్, ఇతర ప్రత్యేక కారణాలు, కాన్ఫరెన్స్ ఇలా ఏ కారణంతో పర్మిట్ కోరుతున్నారో మెన్షన్ చేయాలి. అలాగే వారు ఎయిర్ పోర్టు, సీ పోర్టు లేదా ల్యాండ్ బోర్డర్ లలో ఏలా దేశంలోకి రావాలని అనుకుంటున్నారో కూడా స్పష్టం చేయాలి. అయితే..రీ ఎంట్రీకి అప్లై చేసుకునే వారు తమ దరఖాస్తుకు మద్దతుగా యజమాని లేదా స్పాన్సర్ నుంచి లేఖను పొందాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టులో ఆ ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆ లేఖను చూపించాల్సి ఉంటుంది. అయితే..రీఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ అనుమతి వస్తుందనే గ్యారంటీ మాత్రం ఉండదు. కోవిడ్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొందరికి అనుమతి నిరాకరించనూ వచ్చు. అంత మాత్రానా వారికి భవిష్యత్తులో ఎంట్రీ ఉండదని కాదు.
రీ ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు విదేశాల నుంచే ఎంట్రీ పర్మిట్ కు అప్లై చేసుకోవచ్చు.ICA,GDRFA నుంచి ఫిజికల్ లేదా ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో నిర్ణీత కాల వ్యవధి వరకు(ఎక్కువ 2 నెలల కాలపరిమితి ఉంటుంది) చట్టబద్ధంగా యూఏఈలో ఉండేందుకు అనుమతులు పొందవచ్చు. అయితే..రీ ఎంట్రీ కోసం అప్లై చేసుకునే ముందు..రీఎంట్రీ పర్మిట్ ను ముందుగానే తీసుకోవాలా లేదంటే యూఏఈ చేరుకున్నాక తీసుకోవచ్చా అనేది ఓ సారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు..సదరు ప్రవాసీయుడిని స్పాన్సర్ చేసే వారు కూడా అతని తరపున GDRFA ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా రీఎంట్రీ పర్మిట్ ను ఫాలో చేయవచ్చు. ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వ సంస్థ లేదంటే బంధువు, యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్,హోటల్ నిర్వాకులు తదితరులను స్పాన్సర్ పార్టీలుగా వ్యవహరించవచ్చు.
వీసా గడువు ముగిస్తే ఎలా?
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాసీయులు తమ వీసా గడువు ముగిసిపోతే మళ్లీ కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే వీసా గడువు ముగిసిన వారి రీ ఎంట్రీకి యూఏఈ ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. అందుకే సాధారణ నిబంధనల మేరకు స్పాన్సర్ ద్వారా ప్రస్తుతం ఉన్న వీసాను రద్దు చేసుకొని మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే..విదేశాల నుంచే వీసా దరఖాస్తుపై మాత్రం యూఏఈ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై వివరాల కోసం రాయబార కార్యాలయం సాయం కోరితే మంచిది. విశ్వసనీయ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.
ఇక వివిధ కారణాలతో రీఎంట్రీకి అనుమతి దొరకని వారు నేరుగా యూఏఈ వెళ్లి వ్యవహారం చక్కబెట్టుకోవాలనుకుంటే టూరిస్ట్ వీసా ద్వారా వెళ్లొచ్చు. అయితే..కోవిడ్ హై రిస్క్ దేశాల జాబితాలో ఉన్న ఇండియా,నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల పర్యాటకులకు మాత్రం డైరెక్ట్ ఎంట్రీ ఉండదు.టూరిస్ట్ వీసా ద్వారా వారు గ్రీన్ లిస్ట్ దేశాల్లో క్వారంటైన్ గడువు పూర్తి చేసుకొని అక్కడి నుంచి యూఏఈ చేరుకోవాల్సి ఉంటుంది.
విదేశాల నుండి వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?
నివాసి విదేశాలలో ఉన్నప్పుడు వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయడానికి ప్రస్తుతం నిబంధన లేదు.ఏదేమైనా, ట్రావెల్ ఏజెంట్లు మరియు దౌత్య కార్యకలాపాలు UAE లో ఆశాజనక అధికారులు దీనిని సమీక్షించి, పరిమితులు పూర్తిగా ఎత్తివేయబడిన తర్వాత మార్గదర్శకత్వం అందించవచ్చు.
నేను టూరిస్ట్ వీసాపై యూఏఈలోకి ప్రవేశించవచ్చా?
ఉదాహరణకు, భారత్, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ నుండి పర్యాటక వీసాదారులు ఈ దేశాల నుండి నేరుగా యూఏఈలోకి ప్రవేశించలేరు.బదులుగా, వారు యూఏఈలోకి రావడానికి ముందు కనీసం 14 రోజులపాటు మూడో దేశంలో నిర్బంధించవచ్చు.
ఉదాహరణకు, మీరు ఖతార్ వంటి గ్రీన్ కౌంటీలో ఉండి, మీరు అక్కడ 14 రోజులు నిర్బంధించబడి ఉంటే, మీరు ఎమిరేట్స్‌లో టూరిస్ట్ వీసాతో ప్రయాణించవచ్చు.కొంతమంది ప్రయాణీకులు ఈ విధంగా ప్రయాణించడానికి ఎంచుకున్నారు మరియు వారి వీసాల గడువు ముగియడానికి ముందుగానే యూఏఈకి వెళ్లారు.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









