ఆ వ్యాక్సిన్ ఇప్పుడే వద్దు:WHO
- August 05, 2021
జెనీవా: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.ప్రపంచంలోని అనేక దేశాల్లో డెల్టా వేరియంట్లో వ్యాపిస్తున్నాయి.130కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తోంది.భారత్‌లో సెకండ్ వేవ్ కు ఈ వేరియంటే కారణం.దీని వలన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.భారత్‌లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటుగా కొన్ని పశ్చిమాసియా దేశాల్లో బూస్టర్ డోస్ కింద మూడో డోస్‌ను ప్రజలకు అందించడం మొదలుపెట్టారు.అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ ను ఇవ్వడంపై ప్రణాళికలు వేస్తున్నారు.ప్రపంచంలో కనీసం 10శాతం మందికి రెండు డోసులు వేసేలా ముందు చర్యలు తీసుకోవాలని ఆ తరువాత మూడో డోస్ గురించి ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కోరారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా మొదటి డోస్ పూర్తి కాలేదని, అనేక దేశాల్లో వ్యాక్సిన్ కొరతలు ఉన్నాయని, ఆయా దేశాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. కనీసం సెప్టెంబర్ వరకు బూస్టర్ డోస్ ఆలోచనను మానుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







