లండన్‌లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన
- March 12, 2016
లండన్‌లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బ్రిటన్‌లోని టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై అక్కడ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటన కొనసాగుతోంది. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ స్మార్ట్‌సిటీ మోడల్‌ను చంద్రబాబు పరిశీలించారు. నిర్మాణాలు, సౌకర్యాలు గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బ్రిటన్‌లోని టాప్ 20 కంపెనీలతో సీఎం చంద్రబాబు బృందం సమావేశమైంది. యూకే స్మార్ట్‌సిటీ నైపుణ్యంపై 20 కంపెనీలు ఏపీ బృందానికి ప్రెజెంటేషన్‌ను ఇచ్చాయి. గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్ఐసీఎస్, ఐకామ్, బెనాయ్, అరూప్, మోర్, మెగ్డోనాల్డ్, కటాపల్ట్, స్టాడివ్ఎరినా, రోల్స్ రాయిస్, హార్బర్ట్స్మిత్ ఫ్రీహిల్స్, జేసీబీ, యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్, ఏఆర్ఎం, మేర్స్, గ్లిడ్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక సంస్థ లండన్ ఐని చంద్రబాబు బృందం సందర్శించింది. థేమ్స్ నది అందానికి ముగ్దులైన చంద్రబాబు నవ్వుతూ అక్కడ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. థేమ్స్ నదిలో బోటు షికారు చేశారు. అమరావతిలో లండన్ ఐ తరహా పర్యాటక కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని అధికారులను చంద్రబాబు సూచించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాల కల్పనపై లండన్ స్టాక్ఎక్సేంజ్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చించింది. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై ప్రతిపాదనలు చేశారు. అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్ఎక్సేంజ్ అంగీకరించింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనరీ వార్ఫ్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చలు జరిపింది. అమరావతి అభివృద్ధిలో పాల్గొనాలని కెనరీ వార్ఫ్ సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. అనంతరం అమరావతి నిర్మాణంపై బ్రిటన్ ప్రతినిధులకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్10 రాజధానుల్లో ఒకటిగా నిలపాలన్నది తమ అభిమతమని ఆయన చెప్పారు. అమరావతికి ఉన్న అనుకూలతలను వివరించారు.


తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







