33,000 మందికి కోవిడ్ ఫైన్స్ నుంచి మినహాయింపు
- August 06, 2021
యూఏఈ: కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన 33,000 కేసుల్లో జరిమానాలను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రద్దు చేసింది. కొన్ని కేసుల్లో జరిమానాను తగ్గించింది. కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ 2020 ఇయర్బుక్లో మొత్తం 81,856 ఫిర్యాదులను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్లో నమోదైనట్లు వెల్లడించింది. అయితే..ఇందులో 33,094 మంది అభ్యర్థనల మేరకు కొందరికి జరిమానాలను పూర్తిగా రద్దు చేయగా..ఇంకొందరికి ఫైన్ తగ్గించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గణాంకాల మేరకు అత్యవసర, సంక్షోభం& విపత్తు ప్రాసిక్యూషన్ చట్టం పరిధిలో ప్రస్తుతం 32 క్రిమినల్ కేసులు, 486 అడ్మినిస్ట్రేటివ్ కేసులు మరియు 100 రిమోట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇదిలాఉంటే 2020 లో మొత్తం 18,050 తీర్పులు వెలువరించగా..ఇందులో 95 శాతం దోషుల రేటు నిర్ధారించబడింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









