ప్రవాసులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన!
- August 06, 2021
కువైట్ సిటీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను తిరిగి తమ దేశానికి వచ్చేందుకు కొన్ని గల్ఫ్ దేశాలు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.వీటిలో కువైత్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో తాజాగా కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రవాసులకు కీలక సూచనలు చేసింది.ప్రధానంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఎంబసీ ప్రస్తావించింది.కువైట్ ఆరోగ్యశాఖ అధికారిక (https://corona.e.gov.kw/en)వెబ్సైట్లో వ్యాక్సిన్‌కు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన తర్వాత ప్రవాసులకు సంబంధిత అధికారుల నుంచి కచ్చితమైన సందేశం వస్తోందని పేర్కొంది.ఈ సందేశం వచ్చిన తర్వాతే ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవాలని సూచించింది.
ముఖ్యంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వారికి, అది ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయాన్ని సంబంధిత అధికారులు ఈ-మెయిల్ ద్వారా సందేశం పంపించడం జరుగుతుందని తెలిపింది.ఆ సందేశంలో పేర్కొన్న తప్పులను సరిచేసుకుని మళ్లీ ధృవపత్రాన్ని అప్డేట్ చేసుకోవాలని కోరింది.వ్యాక్సిన్ సర్టిఫికేట్కు కువైట్ సంబంధిత అధికారుల నుంచి ఆమోదం లభించిన తర్వాతే ప్రవాసులు స్వదేశం నుంచి బయల్దేరాలని స్పష్టం చేసింది.లేనిపక్షంలో సమస్యలు తప్పవని హెచ్చరించింది.ఇక ఎదైనా అత్యావసర పరిస్థితి ఉన్న ప్రవాసులు ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలంటే పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఎంబసీ తెలియజేసింది.దీనికోసం దరఖాస్తుదారుడి పాస్‌పోర్టు, సివిల్ ఐడీ, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ పత్రాలు(అందుబాటులో ఉంటే),కువైట్ ఆరోగ్యశాఖలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు సూచించే ఆధారం(మొబైల్ స్క్రీన్‌షాట్ ఫొటో కూడా పంపించవచ్చు),వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుందని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







