హిందుస్తాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగాలు

- August 08, 2021 , by Maagulf
హిందుస్తాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగాలు

హిందుస్తాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలు భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, కోల్‌ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్‌ ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల జాయింట్‌ వెంచర్‌ ఇది. జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, స్టోర్‌ అసిస్టెంట్‌ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 513 ఖాళీల భర్తీని చేపట్టనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్‌ 16 చివరి తేదీ. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://hurl.net.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఉద్యోగాలు:
జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 1 (కెమికల్‌)- 39, (మెకానికల్‌)- 21, (ఎలక్ట్రికల్‌)- 15, (ఇన్‌ స్ట్రుమెంటేషన్‌)- 15, (యూరియా)- 30 (అమ్మోనియా)- 45
జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 2 (అమ్మోనియా)- 30, (యూరియా)- 15, (ఆఫ్‌సైట్‌ అండ్‌ యుటిలిటీస్‌)- 15. ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 1 (ఆఫ్‌సైట్‌ అండ్‌ యుటిలిటీస్‌)- 30
జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 2 (మెకానికల్‌)- 33
ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 1 (మెకానికల్‌)- 36
జూనియర్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్‌ 2 (ఎలక్ట్రికల్‌)- 21
ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 1 (ఎలక్ట్రికల్‌)- 18
జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 2 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)- 24
ఇంజినీర్‌ అసిస్టెంట్‌ 1 (ఇన్‌ స్ట్రుమెంటేషన్‌)- 24
జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్‌- 3, స్టోర్‌ అసిస్టెంట్‌ 1 - 6
స్టోర్‌ అసిస్టెంట్‌ 2 - 3. ఇతర ఖాళీలను భర్తీ చేపట్టనుంది.
దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్టు 3 మొదలైంది. చివరి తేదీ ఆగస్టు 16. విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ పాస్‌ అయి ఉండాలి. డిస్టెన్‌ ్స ఎడ్యుకేషన్, పార్ట్‌ టైమ్, కరస్పాండెన్‌ ్స కోర్సుల ద్వారా పాసైనవారు అర్హులు కాదు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
ఎంపిక విధానం- కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌.
వేతనం- ఫ్రెషర్స్‌కి ఏడాదికి, రూ.3,00,000. అనుభవం ఆధారంగా వేతనం అధికంగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com