ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన PCR టెస్ట్ సెంటర్
- August 09, 2021
న్యూ ఢిల్లీ: భారత ప్రయాణికులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 45-60 నిమిషాల్లో ప్రయాణికులు తమ టెస్టు రిపోర్టును పొందొచ్చు.వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన నివాసితులు ఆగస్టు 5 నుంచి తిరిగి యూఏఈకి రావొచ్చని ప్రకటించింది. ప్రయాణికులు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా పొంది ఉండాలని తెలిపింది.అంతేకాకుండా బోర్డింగ్‌కు ముందు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరు తదితర నగరాల నుంచి యూఏఈకి విమాన సర్వీసలు ప్రారంభమయ్యాయి. కాగా.. బోర్డింగ్ సమయానికి ముందు ప్రయాణికులు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు డాక్టర్ గౌరీ అగర్వాల్(ఫౌండర్-డైరెక్టర్ జినిస్ట్రింగ్స్ డయాగ్నొస్టిక్ సెంటర్) వెల్లడించారు.ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్‌కు రూ.5వేలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిపారు.టెస్ట్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను 45-60 నిమిషాల్లో ప్రయాణికులు పొందొచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







