భారత్‌లో నివసించే విదేశీయులకు శుభవార్త...
- August 09, 2021
న్యూఢిల్లీ: భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాళ్లు తమ పాస్‌పోర్టులను చూపించి కొవిన్ పోర్టల్ https://www.cowin.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతిలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన చేశారు.ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ స్లాట్ అలాట్ అవుతుంది. ఆపై వాళ్లు వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. భారతదేశంలో భారీ సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నారని, వారికి వ్యాక్సిన్ అందజేయడం చాలా అవసరమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.తద్వారా విదేశీయుల జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది.

అధిక జనాభా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని నివారించడంలో ఇది చాలా కీలకమైన అడుగని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకొని విదేశీయుల వల్ల వైరస్ వ్యాపించకుండా కూడా ఈ నిర్ణయం నియంత్రిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, భారత్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుపుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







