PACIలో మరో సివిల్ ఐడీ జారీ మిషన్ల ఏర్పాటు

- August 10, 2021 , by Maagulf
PACIలో మరో సివిల్ ఐడీ జారీ మిషన్ల ఏర్పాటు

కువైట్: సివిల్ ఐడీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు కౌంటర్లు చుట్టు తిరక్కుండా నేరుగా కార్డులు పొందేలా మరో పది కొత్త మిషన్లను అందుబాటులోకి వచ్చాయి. సుర్రాలోని తమ హెడ్ క్వార్టర్లో కొత్తగా మరో పది సివిల్ ఐడీ జారీ మిషన్లను ఏర్పాటు చేసినట్లు పబ్లిక్ ఆథారిటీ & సివిల్ ఇన్ఫర్మేషన్-PACI వెల్లడించింది. సివిల్ ఐడీ కార్డులు పోగొట్టుకున్న వారు, రెన్యూవల్ లేదా కొత్త సివిల్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ ఫోన్లోని క్యూఆర్ కోడ్ ను మిషన్ దగ్గర స్కాన్ చేస్తే చాలు..కొత్త సివిల్ ఐడీ కార్డు ప్రింట్ వస్తుంది. ఇప్పటికే PACI హెడ్ క్వార్టర్లో 70 వరకు సివిల్ ఐడీ కార్డ్ జారీ మిషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మిషన్లతో కలిపి మొత్తం మిషన్ల సంఖ్య 80కి పెరిగింది. ఒక్కో మిషన్ 5000 ఐడీ కార్డులను జారీ చేయగలదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com