షార్జా ఎయిర్ పోర్టులో స్మార్ట్ సేవలు..క్షణాల్లో చెక్-ఇన్ క్లియరెన్స్

- August 10, 2021 , by Maagulf
షార్జా ఎయిర్ పోర్టులో స్మార్ట్ సేవలు..క్షణాల్లో చెక్-ఇన్ క్లియరెన్స్

షార్జా: షార్జా ఎయిర్ పోర్టు మరింత అధునాతన హంగులు సంతరించుకుంది. చెక్-ఇన్, బ్యాగేజ్ చెకింగ్, పాస్ పోర్టు వేరిఫికేషన్ ఇవన్ని క్షణాల్లోనే పూర్తయ్యేలా ఆటోమెటిక్ స్మార్ట్ చెకింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ సమయాల్లో కూడా ప్రయాణికుల వెయిటింగ్ టైం గంటల నుంచి క్షణాలకు తగ్గనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ సిస్టంతో సెల్ఫ్ చెక్-ఇన్, బ్యాగేజ్ కలెక్షన్ వెంట వెంటనే పూర్తవుతాయి. స్మార్ట్ టన్నెల్ తో సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా సెకన్స్ లో ముగిసిపోతుంది. అంటే ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన సమయం నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు ఏ అధికారి ప్రమేయం అవసరం లేదు. డిపార్చర్ హాల్ లో ఏర్పాటు చేసిన కియోస్క్ లు చెక్-ఇన్ చేయడానికి, బోర్డింగ్ పాస్‌ల ఇష్యూ చేయటం, బ్యాగ్‌లను డ్రాప్ చేయటం ఇలా అంతా ఆటోమెటిగ్గా జరిగిపోతుంది. అలాగే ప్రయాణికుల డేటా పాస్ పోర్టు నియంత్రణ కేంద్రానికి వెళ్తుంది. అన్ని సజావుగా ఉంటే క్షణాల్లోనే క్లియరెన్స్ వస్తుంది. కేవలం 20 సెకన్లలోనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎక్కువ మంది స్మార్ట్ చెక్ ఇన్ సేవలు వినియోగించుకునేలా 112కిపైగా సెన్సార్ కియోస్క్ లను ఏర్పాటు చేసినట్లు షార్జా ఎయిర్ పోర్టు అథారిటీ వెల్లడించింది. స్మార్ట్ సేవలను వినియోగించుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులకు సాంకేతిక అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు కూడా స్మార్ట్ విధానం దోహదపడుతుందని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com