ఇండియాలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్
- March 12, 2016
ఇండియాలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంపికైనట్లు మెర్సెర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2016 శనివారం వెల్లడిం చింది. అంతర్జాతీయ నగరాల్లో 139వ ర్యాంకును సాధించిన హైదరాబాద్ దేశంలో మొదటి ర్యాంకును సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక స్థానం దిగజారినా హైదరాబాద్ దేశంలోని అత్యుత్తమ నగరాల్లో మొట్టమొదటి స్థానంలో నిలవడం విశేషం. విద్యుత్ సరఫ రాలో కోతలు పెరగడం, వాతావరణంలో ఏర్పడిన విపరీత మెన మార్పులు హైదరాబాద్ స్థానాన్ని దిగ జార్చాయి. ముఖ్యంగా 2015 మే నెలలో అత్యధిక ఉష్ణోగ్ర తల కారణంగా దేశవ్యాప్తంగా 2 వేల మరణాలు సంభ వించగా, తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లోనే 1,700 మంది మృత్యువాత పడ్డారు.ఈ కారణాల వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఒక స్థానం కోల్పోయిందని మెర్సెర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2016లో పేర్కొంది.
భారతీయ అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానం పూనేకు దక్కింది. అంతర్జాతీయంగా పూనేకు 144వ స్థానం లభించింది. గతేడాది కూడా 144వ ర్యాంకులోనే ఉన్న పూనే ఈ ఏడాది కూడా తన స్థానం నిలబెట్టకుంది. భారతీయ నగరాల్లో జీవన ప్రమాణాల వృద్ధికి అవకాశం కల్పించడం లేదని తన అధ్యయనంలో తేలినట్లు సర్వేలో ప్రకటించింది. గతంలో హైదరాబాద్, పూనే, చెన్నయిల్లో నివసించడానికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతర్జాతీయ, పేరు ప్రఖ్యాతులున్న ఇంగ్లీష్ మాట్లాడే స్కూళ్లు, తక్కువ క్రైమ్ రేటు, అతి తక్కువ వాతావరణ కాలుష్యంతో ఈ నగరాలు ప్రజలను ఆకర్షించాయి. అంతేకాకుండా హైదరాబాద్, పూనే లు తొలి నుంచి దేశంలోనే సంప్రదాయ బిజినెస్ సెంటర్లగా పేరు గడించాయి. ఆర్థిక రాజధాని ముంబైకు 152, రాజధాని నగరం న్యూఢిల్లిdకి 161వ ర్యాంకు లభించింది.
అంతర్జాతీయంగా అత్యుత్తమ నగరంగా వియన్నా మూడోసారి కూడా మొదటి స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో జురిచ్, 3వ స్థానంలో అవుకాలాండ్ మరియు మునిచ్ 4వ స్థానంలో వాంకవుర్ 5వ స్థానంలో నార్త్ అమెరి కాలున్నాయి. ఆసియాలో అత్యుత్తమ నగరంగా సింగపూర్ 26వ స్థానం దక్కించుకుంది. భద్రతా పరమైన అంశాలు, సాంఘీక ఉద్యమాలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ అత్యున్నత జీవన ప్రమాణాల విషయంలో యూరోపియన్ సిటీలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. నగరాల ఎంపికలో భద్రత అంశాన్ని ముఖ్యమైందిగా పరిగణిసు ్తన్నారు. అంతర్జాతీయ నష్టపరిహార ప్రభావం అధికం కావడంతో ఇతర నగరాలకు పంపించే తమ ఉద్యోగుల భద్రతపై కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 450 నగరాల జీవన ప్రమాణాల వివరాలను మెర్కర్స్ సర్వే వెల్లడించింది. ర్యాంకింగ్ కేటాయింపులో ప్రామాణికంగా ఆ దేశ రాజకీయ, సామాజిక వాతావరణాన్ని, మెడికల్ కేర్, ఆరోగ్య సంరక్షణ, పబ్లిక్ సర్వీస్‌లు, రిక్రియేషన్ అవకాశాలు, సాధారణ వాతావరణం వంటివి పరిశీలించింది. ప్రతి ఒక్కరి భద్రతపై ఆరా తీసింది. భద్రతా అంశాలపై 230 ర్యాంకు వరకు ప్రతి నగరాన్నీ పరిశీలించింది.అంతర్గత చట్టాలు, క్రైం రేటు, స్థానిక చట్టాల అమలు, ఒక దేశంతో మరో దేశానికి ఉన్న సంబంధాలపై కూడా అధ్యయనం నిర్వహించింది. వ్యక్తిగత భద్రత విషయంలో లక్సమ్‌బెర్గ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బెర్న్, హెల్సింకి, జురిచ్ దేశాలున్నాయి. అత్యల్ప భద్రత కలిగిన నగరాలుగా బాగ్దాద్ 230 ర్యాంక్, డెమాస్కస్ 229 ర్యాంక్‌లో ఉన్నాయి. ఇండియాలో అత్యధిక భద్రత కలిగిన మొదటి నగరం చెన్నయి 113 ఆ తర్వాత హైదరాబాద్ 121 బెంగళూరు 123 ర్యాంకుల్లో ఉన్నాయి.
ఆసియా పసిఫిక్: ఆసియా ఖండంలోని ప్రజల జీవన ప్రమాణాల్లో పలు వైరుధ్యాలున్నాయని మెర్సెర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు 2016 వెల్లడించింది. ఆసియాలో అత్యుత్తమ నగరంగా సింగపూర్ స్థానం దక్కించుకుంది. అంతర్జాతీయ నగరాల్లో సింగపూర్‌కు 26వ స్థానం లభించింది. చిట్ట చివరి నగరం ఢాకా (214). సింగపూర్ తర్వాత దక్షిణ ఈశాన్య ఆసియా నగరం కౌలాలంపూర్ (86), ఇతర నగరాలు బ్యాంకాక్ (129), మనీలా (136), జకార్తా( 142), పసిఫిక్‌లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియన్ నగరాలు అత్యున్నత నగరాలుగా స్థానం దక్కించుకున్నాయి. అవక్లాండ్ 3వ ర్యాంక్, 10వ ర్యాంకులో సిడ్నీ, 12వ స్థానంలో వెల్లింగ్టన్, 16వ స్థానంలో మెల్‌బోర్న్ లున్నాయి.
ఐరోపా: ఆర్థిక అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ పశ్చిమ యూరోపియన్ నగరాలు అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాలుగా పేరు నిలబెట్టుకున్నాయి. అగ్రస్థానంలోని 10 నగరాల్లో 7 స్థానాలను అవే దక్కించుకుని తమ హవా కొనసాగించాయి. వియన్న మొదటి స్థానాన్ని కొనసాగించగా, జురిచ్ (2), మునిచ్ 4, డస్సెల్‌డార్ఫ్ 6, ఫ్రాంక్‌ఫర్ట్ 7, జెనీవా 8, కోహెన్‌హెగన్ 9 వస్థానంలో ఉన్నాయి. యూరప్‌లో చివరి స్థానంలో ఉన్న నగరాలు కివ్ 176, మిస్క్ 190.
అమెరికా: నార్త్ అమెరికాలోని నగరాలు అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. కెనడా నగరాలు అగ్రభాగాన ఉన్నాయి. వాంకావుర్ 5, టోరోంటో 15, ఒట్టావా 17 ర్యాంకులు దక్కించుకున్నాయి. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో 28 వ ర్యాంక్ తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాఆత బోస్టన్ 34, హోనోలూలూ 35, చికాగో 43, న్యూయార్క్ 44 ర్యాంకుల్లో ఉన్నాయి. మధ్య ఆసియా, ఆఫ్రికా: దుబాయ్ 75వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత అబుదాబి 81, మారిషస్ లోని పోర్ట్ లూయిస 83వ ర్యాంకులో ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









