ఈ నెల 13న విడుదలవుతున్న ‘చైతన్యం’
- August 11, 2021
హైదరాబాద్: కౌటిల్య, యాషిక జంటగా నటించిన చిత్రం ' చైతన్యం '. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మించారు. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ ...‘దుబాయ్‌కి వెళ్లి బాగా డబ్బులు సంపాందించాలనుకున్న ఓ యువకుడు.. అతని జీవితంలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









