6 గం.ల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి..UAE ప్యాసింజర్లకు గైడ్ లైన్స్
- August 12, 2021
న్యూఢిల్లీ: భారత్ నుంచి యూఏఈ చేరుకునే ప్రయాణికులు ఖచ్చితంగా తమ ఫ్లైట్ టైం కంటే 6 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. ఎమిరేట్స్ కొత్త మార్గనిర్దేశకాల అనుసారంగా ఈ కొత్త సూచనలు చేస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. ఎమిరేట్స్ గైడ్ లైన్స్ మేరకు ఇండియాలోని ఏ ఎయిర్ పోర్టు నుంచి అయినా యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఆ తర్వాతే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించాలి. అంటే ప్రతి ప్రయాణికుడు ఫ్లైట్ బయల్దేరే టైం కంటే 6 గంటల ముందు ఎయిర్ పోర్టుకు చేరుకొని...అక్కడి ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లలో టెస్ట్ చేయించుకోవాలి. ఫ్లైట్ టైంకి నాలుగు గంటల ముందు ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లను తెరుస్తారు. ఫ్లైట్ టైంకి రెండు గంటల ముందు కౌంటర్ క్లోజ్ చేస్తారు. ఆ వెంటనే టెస్ట్ రిపోర్టులు అందిస్తారు. నెగటీవ్ రిజల్ట్ వచ్చిన వారికి మాత్రమే ఫ్లైట్లోకి అనుమతించనున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







