“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో

- August 12, 2021 , by Maagulf
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో

హైదరాబాద్: “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల  చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీతం అందించారు.గతంలో ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా విడుదల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంతకాలం క్రితం “పెళ్లిసందడి” చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు.హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా 1996లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి సందడి’ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com