రెసిడెన్సీ పర్మిట్ ముగిసిన ప్రవాసీయులపై చర్యలకు కసరత్తు

- August 13, 2021 , by Maagulf
రెసిడెన్సీ పర్మిట్ ముగిసిన ప్రవాసీయులపై చర్యలకు కసరత్తు

కువైట్: రెసిడెన్సీ పర్మిట్ ముగిసిన ప్రవాసీయులను దేశం నుంచి పంపించేందుకు కువైట్ మినిస్టీరియల్ కమిటీ సిద్ధం అవుతోంది. జలీబ్ అల్ షుయౌఖ్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించిన కమిటీ..రెసిడెన్సీ పర్మిట్ ముగిసినా దేశంలోనే ఉంటున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కమర్షియల్ లైసెన్స్ లేకుండా పని చేస్తున్న కార్మికులు, అనుమతులు లేని ఫుడ్ మార్కెట్లపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రవాసీయులు అన్ని నిబంధనలకు లోబడి ఉండేలా పర్యవేక్షించే ఉద్దేశంతో 2019లోనే కువైట్ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో అంతర్గత శాఖ, మున్సిపాలిటీ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులు. అయితే..కువైట్లో సరైన అనుమతులు లేకుండా ఫుడ్ మార్కెట్లు కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రధానంగా కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. కానీ, లాక్ డౌన్ తో చాలా కాలంగా మర్కెట్లు మూతపడటం, విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతూ వస్తుండటంతో చర్యలు తీసుకునేందుకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసీయులపై కఠిన చర్యలకు కమిటీ సిద్ధమవుతోంది. అలాగే లైసెన్స్ లేని మార్కెట్లు, కార్మికుల పట్ల కూడా కఠినంగా వ్యవహరించనున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com