తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 13, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 87,509 శాంపిల్స్ పరీక్షించగా…427 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో 609 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,40,065 కి పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 3,838 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం 7,812 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.21 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.43 శాతంగా ఉందని కోవిడ్ బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం..
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







