దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి
- August 14, 2021
న్యూ ఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న ఈ తరుణంలో, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సమరయోధుల స్ఫూర్తితో, వారి ధైర్యం, దేశభక్తిని ప్రేరణగా తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంలో దేశ పురోగతి, శ్రేయస్సు కోసం పాటుపడడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు. దేశంలోని అన్ని స్థాయిల ప్రజలకు అభివృద్ధి ప్రయోజనాలు అందిచడం, గౌరవప్రదమైన జీవితాన్ని అందేలా చూడాలని సూచించారు. మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం (షేర్ అండ్ కేర్) వంటి భారతీయ విలువలను ఆదర్శంగా తీసుకుని, మన పౌరులందరికీ భద్రత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యంగపరమైన ఆదర్శాన్ని సాధించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని మన అంతర్గత శక్తులను తిరిగి ఆవిష్కరించుకునేందుకు, మన ప్రజల అపారమైన సామర్థ్యాన్ని గ్రహించేందుకు, వివిధ దేశాల సహకారంలో భారతదేశానికి సముచిత స్థానం సంపాదించుకునేందుకు అందరం పునరంకితమయ్యే దిశగా ప్రతినబూనుదామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







