టర్కీలో భారీ వర్షాలు, వరదలు..44 మంది దుర్మరణం
- August 14, 2021
టర్కీ: టర్కీలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా వరదలు చుట్టుముట్టడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని సమాచారం. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగుతుంది.
వరదల కారణంగా ఇప్పటి వరకు 44 మంది చనిపోయినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారుల స్పష్టం చేశారు.
బోజ్కర్ట్ ప్రాంతంలో గత మూడు రోజుల్లో 45 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇక్కడే భారీగా ప్రాణ నష్టం జరిగింది. వరదల ధాటికి పలు అపార్టుమెంట్లు పునాదులతో సహా కొట్టుపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. వంతెనలు, రోడ్లపై బురద నిండిపోయి ఉన్నది. విద్యుత్ సరఫరా ఇంకా మెరుగవ్వలేదు. తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







