1000 దినార్లకు రెసిడెన్సీ రెన్యూవల్..60 ప్లస్ వారికి వర్తింపు
- August 15, 2021
కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన వారి రెసిడెన్సీ రెన్యూవల్ కోసం మంత్రి మండలి కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తోంది. రెసిడెన్సీ రెన్యూవల్ ను 1000 దినార్లకు తగ్గిస్తూ కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఇంతకుముందు 60 ఏళ్లు దాటిన వారికి రెసిడెన్సీ రెన్యూవల్ చేయాలంటే 2000 దినార్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఆ మొత్తాన్ని ఇప్పుడు సగానికి తగ్గించటం విశేషం. ఈ వెయ్యి దినార్లలో స్టేట్ ఫీజు, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కానున్నాయి. 60 ఏళ్లకుపైబడిన వారికి అధిక బీమా ఛార్జీల కారణంగా బీమా పాలసీ ధర 500 దీనార్ల విలువ ఉంటుందని కౌన్సిల్ నివేదిక పేర్కొంది. బీమా పొందిన వారు ప్రైవేట్ రంగంలోని ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. అయితే..దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







