ఘనంగా జరిగిన వజ్రోత్సవ వేడుకలు..

- August 15, 2021 , by Maagulf
ఘనంగా జరిగిన వజ్రోత్సవ వేడుకలు..

భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్,వేగేశ్న పౌండేషన్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు రాజ్ కమల్ చారిటీస్,అమెరికా వారల సంయుక్త ఆధ్వర్యంలో 5 ఖండాల లోని 30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వజ్రోత్సవ భారతం అనే పేరుతో 12 గంటలపాటు జరిగిన కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.

సురేఖ దివాకర్ల ఆధ్వర్యంలో 10మంది గాయనీమణులు 75 దేశ భక్తి గీతాలను ఆలపించారు.. మండలి బుద్ధ ప్రసాద్,సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర,సాయి కుమార్, మాధవపెద్ది సురేష్, ప్రసాద్ తోటకూర,జి.వి నరసింహం,డా.వంగూరి చిట్టెన్ రాజు, రత్న కుమార్ కవటూరు, సరోజ కొమరవోలు, శ్రీలత మగతల, కల్నల్ కె ఆర్ కె మోహన్ రావు, లెఫ్టినెంట్ కల్నల్ భాస్కర్ రెడ్డి, విజయ తంగిరాల,జయ పీసపాటి, తాతాజీ ఉసిరికల,దీపిక రావి, విక్రమ్, అనిల్ కౌర్ కందించర్ల,శివ ఎల్లపు,ఎమ్.వి.వి సత్యనారాయణ, పృథ్వీరాజ్,వెంకట సురేష్, వేదమూర్తి, ఎస్ డి సుబ్బారావు, వెంకప్ప భాగవతుల,వెంకటేశ్వరరావు తోటకూర,నూనె శ్రీనివాస్, సారథి మోటమర్రి, డాక్టర్ శ్రీదేవి, డోగిపర్తి శంకర్రావు, మధు, సుధామ-రెడ్డి, పార్థసారథి, ధన్రాజ్ జనార్ధన్, డాక్టర్ కె.ఆర్ సురేష్ కుమార్,డాక్టర్ వెంకటపతి తరిగొప్పుల,వేణుగోపాల్ రెడ్డి బోయపల్లి,డాక్టర్ వ్యాస కృష్ణ బూరుగుపల్లి,డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, ఉపేంద్ర చివుకుల, శారద సింగిరెడ్డి,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, డాక్టర్ శ్రీ రామ్ సొంటి,లక్ష్మీ రాయవరపు, గుణ ఎస్ కొమ్మారెడ్డి,లలితా రామ్, శ్రీదేవి జాగర్లమూడి, రమ వనమా, శారద కాశీవజ్ఝుల, డాక్టర్ హరి ఇప్పనపల్లి, రాజేష్ ఎక్కల, మల్లిక్ పుచ్చా,జయరామ్ ఎర్రమిల్లి, డాక్టర్ వెంకటా చారి,రాధిక మంగిపూడి, కళ్యాణి, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, హేమవతి, బి.వి.ఎల్.ఎన్ పద్మావతి,వి కె దుర్గ, మాధవీ రావూరు, సుజా రమణ, సుందరి.టి, లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు,తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకరపల్లి, తదితరులు పాల్గొన్నారని వంశీ రామరాజు తెలియజేశారు.ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాబడింది.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com