కువైట్: ఇండియన్ అంబాసిడర్ కీలక ప్రకటన
- August 15, 2021
కువైట్: కువైట్ లోని ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్..భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక ప్రకటన చేశారు.కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడించారు.ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ..మొదటి విడతలో భాగంగా 65 కుటుంబాలను ఎంపిక చేసినట్టు చెప్పారు.కుటుంబానికి రూ.లక్ష పెద్ద మొత్తం కానప్పటికీ.. దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.120 KD కంటే తక్కవ వేతనం కలిగి ఉండి..కువైట్ లో కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలను టాస్క్ ఫోర్స్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







