అబుధాబిలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2021
అబుధాబి:75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యూఏఈలోని అబుధాబిలో అంగరంగ వైభవంగా జరిగాయి.అబుధాబిలో భారతీయులందరికి కేంద్ర బిందువు అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో మరియు సంస్థ కళా ప్రాంగణం లో ఎంతో వైభవంగా జరుపుకున్నారు.అబుధాబిలో కోవిడ్ నిబంధనలు కఠిన తరంగా ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం,రెండు దేశాల మధ్య ఉన్న సయోధ్య దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర వేడుకలు జరుపు కోవడానికి అనుమతి ఇచ్చ్చారు అని సంస్థ ప్రధాన కార్య దర్శి జో జో అంబూకెన్ తెలియ జేశారు. ఈ రోజు ఉదయం జరిగిన వేడుకలకు కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మెహ్రా అల్ మెహ్రి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు.సంస్థ అధ్యక్షుడు జార్జి వర్గీస్ ముఖ్య అతిధి సమక్షం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తదనంతరం సంస్థ అధ్యక్షుడు వర్గీస్ మాట్లాడుతూ ఎందరో త్యాగ మూర్తుల బలి దానాల ఫలితమే ఈ రోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులని మరియు భావి భారత నిర్మాణం లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతయినా ఉందని తెలియ జేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్బం గా సంస్థ సభ్యులు బీరన్,యూనిస్ కి కోవిడ్ సమయం లో వారు చూపిన సమాజ స్ఫూర్తి కి పురస్కారం అందజేయడం జరిగింది అని సంస్థ సంక్షేమ కార్య దర్శి రాజా శ్రీనివాస రావు తెలియజేశారు.

భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రం జరిగిన ఆజాదికి అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశం లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన మరియు నాట్య కళా ప్రదర్శన జరిగింది.ఈ కార్యక్రమంలో గుజరాత్,కేరళ,తమిళ,మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చెందిన అస్సోసియేషన్స్ పాల్గొని వారి వారి ప్రాంతాల కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు.ముఖ్యముగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంత గానో ఆకర్షించింది.సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన మరియు నాట్య కళా ప్రదర్శన జరిగింది.ఈ కార్యక్రమం లో గుజరాత్, కేరళ, తమిళ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చెందిన అస్సోసియేషన్స్ పాల్గొని వారి వారి ప్రాంతాల కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు.ముఖ్యము గా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంత గానో ఆకర్షించింది.సాయంత్రం జరిగిన కార్యక్రమానికి లూలూ గ్రూపుల సంస్థ చైర్మన్ మరియు ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ అయిన పద్మ శ్రీ డా.యూసుఫ్ అలీ MA ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.ఈ కార్యక్రమంలో సంస్థ క్రీడా కార్యదర్శి ఫ్రెడ్డీ,ఉప ప్రధాన కార్యదర్శి జార్జ్ వర్గీస్ మరియు ఉప కోశాధికారి దినేష్ మరియు జనరల్ మేనేజర్ రాజు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







