సీఐ కేశవ్ నాయుడుగా ధన్‌రాజ్
- August 16, 2021
హైదరాబాద్: సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్ థ్రిల్లర్.. అనేది మూవీ ట్యాగ్‌లైన్. దీనిని బట్టే సినిమా జానర్ ఏమిటనేది అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ కొద్ది రోజుల క్రితం విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రముఖ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేశారు. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, భాను, నందు మాటలు రాశారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







