గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను గెలుచుకున్న రవి కుమార్ తోలేటి!
- August 16, 2021
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రవి కుమార్ తోలేటి ఒరిగామి పీకాక్ (కాగితం మడచడం ద్వారా నెమలి బొమ్మ తయారీ) అతిపెద్ద ప్రదర్శనతో ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను గెలుచుకున్నారు. రవి కుమార్ తన అసాధారణ ప్రతిభతో 1776 ఒరిగామి పీకాక్‌లను మోడలింగ్ చేసి, తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలోని కళామందిర్ ఆడిటోరియంలో 15 నవంబర్ 2020 న ప్రదర్శించారు.నగరానికి చెందినటువంటి ఇద్దరు ప్రముఖ పౌరులు,బిఎస్‌ఎన్ మూర్తి, డైరక్టర్,కెన్నడీ స్కూల్స్ మరియు మంజులత కళానిధి, సిటీ ఎడిషన్ ఎడిటర్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ ప్రదర్శనను తిలకించేందుకు మరియు రికార్డులను సృష్టించే ఈ ప్రదర్శనకు సాక్షులుగా నిలిచేందుకు హాజరయ్యారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించాలనే తన ప్రయత్నంలో రవి, 29 అక్టోబర్ 2020 నుండి 14 నవంబర్ 2020 వరకు రోజుకు సగటున నాలుగు గంటల పాటు దానిపై పనిచేసి 1800 పీకాక్ పేపర్ ఫోల్డ్‌లు తయారు చేయడం జరిగింది. ఇది ఒక సవాలుతో కూడుకున్న పని, కానీ ఒరిగామి పట్ల నాకు ఉన్న అభిరుచి ఒక చోదక శక్తిగా పనిచేసిందని,రవి కుమార్ తోలేటి తెలిపారు.
తగిన జాగ్రత్త మరియు క్షుణ్ణమైన ప్రామాణీకరణ చేసిన మీదట,రవి కుమార్ తోలేటి కార్యక్రమాన్ని ఒరిగామి పీకాక్ అతిపెద్ద ప్రదర్శనగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది, జిడబ్ల్యుఆర్ (గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్) ద్వారా సెట్ చేయబడిన కనీస సంఖ్య 1500ను అధిగమించింది. 24 జూలై 2021న రవి కుమార్‌కు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్‌ను అందించింది.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనటువంటి రవి కుమార్ తోలేటి, 1988 నుండి ఓరిగామి కళ పట్ల ఆయన ఎంతో మక్కువను పెంచుకున్నారు.ఆయన తన విద్యార్థులు వారి యొక్క సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి మరియు వారి ప్రాజెక్ట్ పనులను ప్రదర్శించే మార్గాలను అన్వేషించే సందర్భంలో దీని గురించి చూడడం జరిగింది. ఒరిగామికి సంబంధించి పాల్ జాక్సన్ రాసిన పుస్తకం త్వరగా ఈ కళను నేర్చుకోవడంలో ఆయనకు సహాయపడిరది.తన ఇంటికి పోస్టర్‌ని రూపొందించడం ద్వారా ఒరిగామిపై ఆయన తన తొలి ప్రయత్నం చేశారు, 32 సంవత్సరాల తర్వాత కూడా అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.ఒరిగామిపై ఆయన రచనలకు అనేక ప్రశంసలు లభించాయి, విద్యార్థుల ఎడ్యుకేషనల్ ప్రాజెక్టుల కోసం దానిని స్వీకరించడంలో ఆయనను ప్రేరేపించింది మరియు అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజుకు కూడా ఆయన అప్పుడు తాను కనుగొన్న దానిపై ఇప్పటికీ అంతే ఆసక్తితో ఉన్నారు.
విద్యలో ఒక సాధనంగా ఒరిగామి కళ ప్రాచుర్యం పొందడానికి, ముఖ్యంగా మ్యాథ్స్ మరియు సైన్స్ అంశాలను సులభంగా గ్రహించేందుకు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు ఈ ఛానెల్ ద్వారా తన ప్రాజెక్ట్‌లు మరియు ఎగ్జిబిషన్‌ల వీడియోలను ప్రదర్శించడానికి అది ఒక వేదికగా ఉండటమే కాకుండా, విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన డిఐవై (స్వయంగా చేసుకునే) మోడళ్లు రూపొందించడానికి సహాయపడుతున్నది.
నా పనికి నేను అందుకుంటున్న ప్రశంసలతో, మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే కోరిక నాకు తీవ్రంగా ఉన్నది. విద్యార్థులలో ఒరిగామి కళకు మరింత ప్రాచుర్యం లభించింది. ఒరిగామిపై నా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నేను ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ఒరిగామికి సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఫీట్ నాకు కనిపించింది. నా స్వంత పేరుతో ఒకదాన్ని సృష్టించుకోవాలని మరియు నాకు ప్రావీణ్యం ఉన్న రంగంలో నా దేశంకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే కోరికకు అది నాకు స్ఫూర్తినిచ్చింది అని రవి కుమార్ తోలేటి తెలిపారు.
రవి తాను పనిచేసినటువంటి అన్ని పాఠశాలల్లో ఒరిగామిపై అనేక ఎగ్జిబిషన్‌లను నిర్వహించారు. వీటిలో రెండు ఎగ్జిబిషన్‌లు ఎనిమల్ ఫోల్డ్‌లకు కోసం ప్రత్యేకించబడినవి. వాటిలో ఒంటెల ఊరేగింపు అయిన ఒకదానికి ‘‘కారవాన్’’ అనే పేరు పెట్టారు. నాకు మడత (పేపర్ ఫోల్డ్) అంటే చాలా ఇష్టం.మేము దాదాపు 100 ఒంటెలను ప్రదర్శించగలమని ఆయన అన్నారు. మరొకటి ‘‘యానిమల్ ప్లానెట్’’, అందులో నక్కలు, పాండాలు, హరిణజాతి జింకలు (గజెల్) మరియు అనేక ఇతర జంతువులను ప్రదర్శించారు. వాటన్నింటిలోనూ, దాదాపు 50 పాండాలతో ఉన్న ఒక పోస్టర్ ప్రదర్శన ఉంది. అంతరించిపోతున్న జంతువులపై అవగాహన కల్పించడానికి అది దోహదపడుతుంది, ఆయన హరిణజాతి జింక (గజెల్) యొక్క జీవిత పరిమాణ నమూనాను కూడా తయారు చేశారు.1995 లో, రవి ఒక పోస్టర్‌ను సృష్టించాడు (నెమలి యొక్క మొజాయిక్ - రెండు డైమెన్షనల్), అందులో మూడు వేల మడతలు ఉన్నాయి. దీన్ని సృష్టించడానికి రవి రోజుకు ఆరు గంటల చొప్పున 23 రోజులు పాటు శ్రమించారు. ‘ఇది నాకు ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్. నేను దానిని ఫ్రేమ్ చేసాను మరియు ఇప్పటికీ దానిని మా ఇంట్లో భద్రపరిచాను.
‘యువ విద్యార్థులకు ఒరిగామి నేర్పించాలని నేను గట్టిగా భావిస్తున్నాను మరియు వారు దాని ప్రాముఖ్యతను నేర్చుకుంటారు. వారు నమూనాలను తయారు చేసి, వాటిని వారి విద్యా విషయాల కోసం ప్రాజెక్ట్‌లుగా సమర్పించాలి. విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో ఒరిగామిని పరస్పరం అనుసంధానించాలి. విషయాలను పరస్పరం అనుసంధానించేందుకు వారు తమ సృజనాత్మకతను ఉపయోగించాలి. అలాగే, ఒరిగామికి సంబంధించి ప్రపంచంలో జరుగుతున్న తాజా పరిణామాలను వారు వెబ్‌లో పరిశోధన చేయాలి.
ఒరిగామిలో అనేక అప్లికేషన్లు ఉన్నాయి మరియు ఔత్సాహిక విద్యార్థులు దానిని ఒక వృత్తిగా ఎంచుకోవచ్చు. ఇది వైద్య నిర్ధారణలో ఉపయోగించబడుతుంది, స్పేస్ డిపార్ట్‌మెంట్ కోసం సోలార్ మాడ్యూల్స్, ఏరో స్పేస్ కోసం పారాచూట్ ఫోల్డ్స్, డిఎన్‌ఎ హెలిక్స్, ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ వర్క్ మరియు అనేక సృజనాత్మక డోర్లు ఒరిగామి ఫోల్డ్‌లతో తయారు చేయబడ్డాయి. ఈ రంగంలో అవకాశాలు అనంతం.
32 సంవత్సరాల క్రితం, నేను ప్రారంభించినప్పుడు అన్వేషించేందుకు ఎలాంటి పుస్తకాలు అందుబాటులో లేవు. ఇప్పుడు మీకు అన్వేషించడానికి మరియు నేర్చుకోవడానికి ‘సమయం’ మాత్రమే ఉండాలి.ఒరిగామి యువ మనస్సులలో సృజనాత్మకతను మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తుంది.ప్రారంభకులు ఒరిగామిని ఎంతో సహనంతో నేర్చుకోవాలని నేను సూచిస్తున్నాను.తుది ఫలితాలు ఎంతో మనోహరంగా ఉంటాయని రవి కుమార్ తోలేటి అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







