అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!

- December 30, 2025 , by Maagulf
అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!

రియాద్: యెమెన్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి, తూర్పు యెమెన్‌లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దళాలకు మద్దతుగా వచ్చిన రెండు నౌకలను సౌదీ అధికారులు అడ్డగించారు. అనుమతి లేకుండా ముకల్లా ఓడరేవులో దించిన ఆయుధాలు మరియు యుద్ధ వాహనాలను సీజ్ చేసినట్లు సంకీర్ణ ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్-మాలికి తెలిపారు.

ఈ రెండు నౌకలు డిసెంబర్ 27-28 తేదీలలో ఫుజైరా ఓడరేవు నుండి సంకీర్ణం జైంట్ ఫోర్సెస్ కమాండ్ అధికారిక అనుమతి పొందకుండా వచ్చాయని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు , సైనిక వాహనాలను దించేందుకు ముందు సిబ్బంది నౌకల ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేశారని ఆయన తెలిపారు. ఈ సరుకు తూర్పు యెమెన్‌లోని హద్రామౌత్ మరియు అల్-మహ్రా గవర్నరేట్‌లలో సంఘర్షణను పెంచడానికి ఉద్దేశించబడింది. ఇది ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com