పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ

- December 30, 2025 , by Maagulf
పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి అని వెల్లడించింది.దీని చివరి గడువు డిసెంబర్ 31, 2025. గడువు ముగిసిన తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు జనవరి 1, 2026 నుండి పనిచేయవు.

లింక్ చేయకపోతే ₹1,000 జరిమానా విధించబడుతుంది.అలాగే, పాన్ ఆధార్ లింక్ కానివాటికి బ్యాంక్ లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్రెడిట్, పన్ను రిటర్న్ ఫైలింగ్ వంటి ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తవచ్చు.

మీరు మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్‌ను http://www.incometax.gov.inవెబ్‌సైట్ లేదా SMS ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. SMS కోసం [ఆధార్ నంబర్] [పాన్ నంబర్] 567678/56161 ఫార్మాట్‌లో పంపాలి.

ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యాలు కూడా అందిస్తోంది. సమస్యలు ఎదురైతే ITD హెల్ప్‌లైన్(Helpline) లేదా సపోర్ట్ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ మార్పులతో పాన్ మరియు ఆధార్ అనుసంధానం సులభం అవుతుంది, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com