అఫ్గాన్ కు విమానాలను రద్దు చేసిన యూఏఈ

- August 17, 2021 , by Maagulf
అఫ్గాన్ కు విమానాలను రద్దు చేసిన యూఏఈ

యూఏఈ: అఫ్గాన్ లో మారుతున్న పరిణామాలు, ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్లె తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశానికి ఫ్లైట్ సర్వీసులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అప్గానిస్తాన్ కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ప్రకటించింది. అప్గానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలస్తున్నామని, ప్రస్తుతం ఆ దేశానికి విమాన సర్వీసులను కొనసాగించటం శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com