తిరిగి విధులకు హజరుపై కొన్ని వర్గాలకు మినహాయింపు
- August 17, 2021
అబుధాబి: కోవిడ్ ఆంక్షల నుంచి తిరిగి సాధారణ జనజీవనం వైపు అడుగులు వేస్తున్న అబుధాబి..తిరిగి విధులకు హజరయ్యే ఉద్యోగుల విషయంలో క్లారిటీ ఇచ్చింది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు విధులకు హజరు కావాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అబుధాబి హెల్త్ సెంటర్ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..విధులకు హజరయ్యే ఉద్యోగులు వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎలివేటర్ల ఉన్నప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. కరోనావైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ, రిమోట్ వర్కింగ్ మీటింగ్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చింది, అలాగే హ్యాండ్‌షేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని సూచించింది. వైరస్ ప్రభావాన్ని సాధారణ లక్షణాల స్థాయికి నియంత్రించటంలో వ్యాక్సిన్లు ప్రభావ వంతంగా పని చేస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకన్న వారికి కోవిడ్ సోకినా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం దాదాపుగా ఉండదని, దాదాపు రెండు రోజుల్లోనే లక్షణాలు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. మరణాల రేటు తగ్గుతుందని స్పష్టం చేసింది. ఓ మాదిరి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా 024493333 నంబర్‌ను సంప్రదించాలని అబుధాబి హెల్త్ సెంటర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







