అంతర్జాతీయ ప్రయాణాల కోసం IATAతో తవాక్కల్నా లింక్
- August 19, 2021
సౌదీ: అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రయాణ విధానాలను సులభతరం చేసేందుకు సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తవక్కల్నా హెల్త్ పాస్ పోర్టులను అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) యాప్‌తో లింక్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణికుల ప్రయాణికుల హెల్త్ స్టేటస్ ను విశ్లేషించుకొని వారి ప్రయాణాలకు క్లియరెన్స్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది. పౌర విమానయాన చట్టానికి లోబడి కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికుల అర్హతను నిర్ధారించుకోవటం అంశాల్లో తవక్కల్నా, IATA యాప్ సమ్మేళన వేదిక పరస్పర సహకారానికి వీలు కలుగుతుంది. SDAIA ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అల్-గమ్ ది మాట్లాడుతూ, హెల్త్ పాస్‌పోర్ట్‌ను లింక్ చేయడం ద్వారా డిజిటలైజ్ డేటాతో ప్రయాణికుల స్థితిని సులభంగా గుర్తించి, కింగ్డమ్కి రాకపోకలు నిర్వహించే ప్రయాణ ప్రక్రియను ఈజీగా, స్పీడ్ గా నిర్వహించొచ్చని అన్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







