జీతాల కోసం 300 మంది వ్యవసాయ కార్మికుల ఆందోళన
- August 19, 2021
కువైట్: చేసిన కష్టం వెట్టిచాకిరిగా మారుతోందని, జీతాలు కూడా ఇవ్వటం లేదంటూ దాదాపు 300 మంది వ్యవసాయ కార్మికులు ఆందోళన పాట పట్టారు. కువైట్‌లోని అబ్దాలీ ఫార్మ్ దగ్గర వీరంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది..హింసాత్మక ఘటనలకు ఆస్కారం ఇవకుండా ముందుజాగ్రత్తగా సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో వ్యవసాయ కార్మికులు తమ గోసను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..కనీస వసతులు కూడా లేవని, దుర్భర పరిస్థితుల్లో తాము బతుకీడుస్తున్నామని అక్కడి పరిస్థితులను వివరించారు. వ్యవసాయ కార్మికులు గోడు విన్న అంతర్గత మంత్రిత్వ శాక సిబ్బంది..కంపెనీ అధికారులతో మాట్లాడి బకాయి జీతాలు చెల్లించేలా ఒప్పించింది. జీతాలు చెల్లిస్తామంటూ కంపెనీ ప్రతినిధుల నుంచి హామీ రావటంతో వ్యవసాయ కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







