అఫ్గాన్ శరనార్ధులను ఆదుకోండి..ఖతార్ కు UN విన్నపం
- August 19, 2021
దోహా: ప్రాణాలను కాపాడుకునేందుకు అఫ్గాన్ నుంచి తరలొస్తున్న శరణార్ధుల విషయంలో మానవతా కోణంలో చూడాలంటూ ఐక్యరాజ్య సమితి..ఖతార్ ను కోరింది. ఇదే విషయంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి..ఖతార్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్-థానీకి ఫోన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘన్ శరణార్థుల సమస్య పరిష్కారానికి, వారితో వ్యవహరించాల్సిన విధానాలపై అంతర్జాతీయ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వస్తున్న ఆఫ్గాన్ పౌరులను తిప్పిపంపేందుకు బలపెట్టొద్దని ఫోన్లో ఫిలిప్పో గ్రాండి కోరారు. అదే సమయంలో అఫ్గాన్ లో శాంతిస్థాపన కోసం, రాజకీయ సుస్ధిరత కోసం ఖతార్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







